Saturday, 3 September 2016

బక్కగా ఉన్నారా ? బరువు పెరగాలా ? అయితే వీటిని తినండి


Weak Body

ఎండుద్రాక్షలో Vitamins పుష్కలంగా ఉంటాయి. Antioxidants, పీచు వంటివి రక్తహీనతను దరిచేరనివ్వవు. ఎండుద్రాక్షలకు జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి బాగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా రోజుకు ఆరు లేదా ఐదింటిని తీసుకుంటే.. చిన్న పేగులోని వ్యర్థ పదార్థాలను సులభంగా భయటికివెళ్ళిపోతాయి. ఎండుద్రాక్షల్లోని పీచు కడుపులోని నీటిని పీల్చేస్తుంది. తద్వారా విరేచనాలు వంటి ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేస్తుంది. 

వీటిలో Proteins, vitamins పుష్కలంగా ఉండటం ద్వారా బక్కపలచగా ఉన్నవారు తీసుకోవచ్చు తద్వారా బరువు పెరుగుతారని Nutritions చెప్తున్నారు. Players తన శరీరానికి బలం చేకూర్చుకోవాలంటే.. ఎండుద్రాక్షల్ని తీసుకోవడం మంచిది. ఎండుద్రాక్షల్లోని ధాతువులు, Cholesterol, vitamins, పీచు వంటివి శరీరానికి పోషకాలను అందిస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. 

వీటిలోని Antioxidants, క్యాన్సర్ కణాలను దూరం చేస్తాయి. హైబీపీని నివారిస్తాయి. గుండెను పదిలంగా ఉంచుతాయి. ఎండుద్రాక్షల్లో Potassium రక్తనాళ్లాల్లో ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా వీటిలో Vitamin B Complex, Iron ఉండటం ద్వారా రక్తకణాల ఉత్పత్తికి ఎంతగానో ఉపకరిస్తాయి.

Friday, 19 August 2016

చుండ్రుకి శత్రువులాంటి ఔషధం Neem వేప

neem benefits
మనం నిత్యం చూస్తున్న అనేక మొక్కల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మొక్కలో ఏదో ఒక ఔషధ గుణం ఉంది.. కానీ అవి మనం కానీ అవి మనం పెద్దగా పట్టించుకోవడం లేదు .. ఎక్కువగా మనకు ఉపయోగ పడే చెట్టులో వేపచెట్టు ప్రథమంగా నిలుస్తుంది. ఎందుకంటే ప్రకృతిసిద్ధంగా లభించే వేపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. Anti-bacterial గుణాలు వేపాకులో చాలా ఎక్కువగా ఉండటం వల్ల Diabetics, Skin Allergies, చుండ్రు, దురద వంటి అనేక సమస్యలను నివారించడంలో వేపాకు ఎంతగానో సహాయపడుతుంది సహాయపడుతుంది. 
ఇందులో 35 రకాల శక్తివంతమైన ఇంగ్రిడియంట్స్ ఉన్నాయి ఉన్నాయి అని కనుగొన్నారు . అవి తలపై వచ్చే చుండ్రు, దురద వంటి సమస్యలను సులువుగా పోగొడతాయి. పెరుగు, మెంతులు ఇందుకు సహాయపడతాయి. మెంతులు జుట్టును strong గా చేస్తాయి. వేపాకు, మెంతులలో Anti-bacterial గుణాలున్నాయి. పెరుగు Heating కండిషనర్‌ లా పనిచేస్తుంది. ఈ Hair Pack ద్వారా చుండ్రు సమస్య తగ్గడమే కాదు, దురద కూడా తగ్గిపోతుంది.
చుండ్రు నివారించడానికి వేప నూనె చక్కటి పరిష్కారం. కొబ్బరినూనె, వేప నూనెను సమాన భాగంలో తీసుకుని కలుపుకోవాలి. ఈ Oil ని మాడుకు రాసుకోవాలి. తర్వాత 20 నిమిషాల పాటు బాగా మర్దనా చేయాలి. ఇలా చేస్తూ ఉంటే చుండ్రు తగ్గుముఖం పడుతుంది. నీళ్లను బాగా మరిగించి దానిలో కొన్ని వేపాకులు కలపాలి. నీటిలో రాత్రంతా అలానే నాననివ్వాలి. ఈ వేప నీటితో ఉదయాన్నే తలస్నానం చేసుకోవడం వల్ల తలలో చుండ్రు ద్వారా వచ్చిన దురద తగ్గిపోతుంది.
నాన బెట్టిన మెంతులు, వేపాకు, పెరుగు సమానంగా తీసుకుని Paste లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, గంట తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వేపాకు paste కూడా చుండ్రు నివారణకు సరైన ఉపాయం. వేపాకులకు నీళ్లు, తేనె కలుపుతూ paste చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి కాసేపి తర్వాత కడిగేసుకుంటే.. మంచి ఫలితాలనిస్తుంది. 

Tuesday, 9 August 2016

You Need To Know Top 10 Zika Virus Facts

Zika virus

Zika virus disease is precipitated with the aid of a pandemic transmitted through Aedes mosquitoes and it is rapidly spreading. This is a top 10 video that outlines the details you have got to find out about this virus.

Computer ముందు ఎక్కువ Time గడిపే వాళ్ళు జర జాగ్రత్త ..?

body position in front computer

ప్రస్తుత రోజుల్లో మానవ జీవితం computer తో ముడిపడి ఉంది . గంటలు తరబడి computer మీద కూర్చొని పని చేసేవాళ్ళు ఉన్నారు. ఇల ఎక్కువ time work చేయడం వలన చాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని Doctors సూచిస్తున్నారు. కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్యలు బారినపడకుండా ఉండచ్చు అవేవో తెలుసుకుందాము. 

1.  Computer ను తదేకంగా చూడటం వల్ల ఎక్కువగా కంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్ని చిన్న అక్షరాలను చూసేందుకు కళ్లు ఇబ్బంది పడతాయి. వాటిని అలాగే తేదేకంగా చుసిన  కళ్లు గుంజడం వంటివి జరుగుతాయి.

2. ఎక్కువ సమయం Computer ముందు కూర్చోవడం వల్ల నడుముల్లో నొప్పి కలుగుతుంది. గంటల తరబడి కదలకుండా అలానే కుర్చిలో కూర్చోవడం వల్ల శరీర భాగాలు మొద్దు బారిపోయినట్లుగా కనిపిస్తాయి. కీళ్ల నొప్పులకు Computer కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తిన్న వెంటనే Computer ముందు కూర్చోవడం వల్ల ఉబకాయం సమస్య వచ్చే అవకాశం ఉంది. 

తెసుకోవాల్సిన జాగ్రత్తలు : 

1. Computer లో అక్షరాలు పెద్దగా కనిపించేలా Setting చేసుకోవాలి . అదే సమయంలో Anti replekt galss ను వినియోగించి కంటిపై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. గంటల తరబడి Computer ముందు కదలకుండా కూర్చోకూడదు. అప్పుడప్పుడు లేచి అటూ ఇటూ నడుస్తుండాలి . ఎప్పుడు ఒకే యాంగిల్‌లో కాకుండా కదులుతూ ఉండాలి. ఎక్కువ సమయం వంగి కూర్చోవడం వల్ల నడుములో నొప్పి వస్తుంది. వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోవడం మంచిది .

2. Computer Table అనువుగా, Computer కుర్చి సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. తిన్న వెంటనే కూర్చోవడం వల్ల ఉబకాయం వస్తుంది. కనీసం తిన్న తర్వాత ఒక పది నిమిషాలు అయినా నడిచి ఆ తర్వాత Computer ముందు కూర్చోవాలి.

Tags: body position in front computer, Health tips to in front of computers, Best health tips in teugu

Sunday, 31 July 2016

డ్రింక్ చేస్తే.. క్యాన్సర్ cancer వస్తుందా?

alcohol effect to health
Normal గా ఎక్కువగా మద్యం Alcohol సేవించేవారికే Cancer risk వుంటుందన్నది అందరి అభిప్రాయం కదా . కానీ తాజా అధ్యయనం ప్రకారం Moderate drinker కూడా ఈ వ్యాధి బారినపడే ప్రమాదముందని తేలింది. వొటాగో యూనివర్సిటీ రీసెర్చర్లు ( Votago University researchers ) చేసిన ఈ స్టడీలో.. మామూలు స్థాయిలో మద్యం తాగినప్పటికీ గొంతు, నోరు, లివర్ వంటి శరీర భాగాలకు Cancer సోకుతుందని తేలింది.
New Zealand లో గతంలో జరిపిన పరిశోధనల్లో 80 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారికి cancer సోకిందని, 236 Cancer మరణాలు సంభవించాయని అంటున్నారు. మహిళల్లో Breast Cancer కూడా దీనివల్లే వచ్చే అవకాశముందని అంటున్నారు. రోజుకు సగటున రెండు డ్రింకులకన్నా తక్కువగా తాగేవారికీ ఈ మహమ్మారి సోకుతుందని, ఇప్పటివరకు Heavy drinker వాళ్ళు క్యాన్సర్‌కు గురయ్యేవారన్న అభిప్రాయం వుండగా, ఇలా సరికొత్త పరిశోధనలో ఈ విషయం Reveal కావడం విశేషం. New Zealand లో ఈ పరిశోధనలు జరిగినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం వుందని గుర్తుచేస్తున్నారు.

Wednesday, 27 July 2016

చద్దన్నం తినడం వల్ల కలిగే లాభాలు అంత ఇంత కాదు తెలుసుకోండి

village curd rice

చాలా పల్లెల్లో పొద్దున్నే సద్దెన్నం తింటారు.. అందుకే వారు చాలా ఆరోగ్యం తో ఉంటారు. అదే టౌన్ లో అయితే చాలా వరకు రాత్రి అన్నం మిగిలితే morning  పారేయడమో లేదా పనివాళ్ళకి ఇవ్వడమో చేస్తారు..! ఎందుకంటే వాళ్ళకి టిఫణీలు కాపీలు Fashion కదా..!  కానీ వాస్తవం ఏమిటంటే  కొంతమంది పరిశోధకులు దీని గురించి కొన్ని ఆశక్తికర విషయాలు బయటపెట్టారు. 

రాత్రిపూట మిగిలిపోయిన అన్నం మార్నింగ్ తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిదట. పెద్దల కాలంలో మన తాతలు అవ్వలు సద్దన్నం లో మజ్జిగ కలుపుకొని ఉల్లిపాయ మరియు మిరపయాక నంచుకుని తినేవారు .. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు .. 100 ఎడ్లు బ్రతికేవాళ్లు.

ఓకే అసల విసయానికివస్తే అన్నంను రాత్రి అంతా ఉంచడంవల్ల అందులో కొన్ని రకాల మార్పులు చోటుచేసుకుంటాయి.. 50 గ్రాముల అన్నంను తీసుకుని రాత్రి పులియపెట్టినట్లయితే 1.6 మిల్లీ గ్రాములు ఉన్న Iron 35 మిల్లీ గ్రాములుగా పెరుగుతుంది. అలాగే Potassium మరియు Calcium లు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి, ఇవన్నీ మన శరీరాన్ని మరింత ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతాయి.

చద్దన్నం తినడం వలన కలిగే ప్రయోజనాలు:

1. ఎక్కువ సమయం ఉల్లాసంగా ఉండాలంటే మార్నింగ్ సద్దన్నం తినాలి 
2. శరీరంలో రోగనిరోదక శక్తి ని పెంచుతుంది.
3. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు  చద్దన్నంలో పెరుగు, ఉల్లిపాయ వేసుకుని తింటే ఆ వేడి తగ్గుతుంది.
4. పలు చర్మ వ్యాదుల నుండి కాపాడుతుంది.
5. మ‌ల‌బ‌ద్ద‌కం, నీర‌సం త‌గ్గిపోతాయి. బీపీ అదుపులో ఉంటుంది.
6. పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం ఈ చద్దన్నం తగ్గిస్తుంది.

Tuesday, 26 July 2016

వేడి నీటితో స్నానం చేస్తే వ్యాయామంతో సమానమట!

hot water benefits

లండన్‌, జూలై 24: వ్యాయామం చేయలేక పోతున్నామని ఇక చింతించనక్కర్లేదు. Hot Water తో స్నానం చేస్తే చాలు, వ్యాయామం చేసిన ఫలితాలు వస్తాయని Scientists పేర్కొంటున్నారు. వ్యాయామం చేసినప్పుడు శరీరంలో వేడిపుడుతుంది, అదేవిధంగా వేడి నీటితో స్నానం చేసినా శరీరంలో వేడిపుడుతుందని యూకే లోని Loughborough University కి చెందిన Steve falkiner చెప్పారు. 2300 మంది మధ్య వయసు వ్యక్తులను సగటున 20 సంవత్సరాలు అధ్యయనం చేశారు. ఇందులో వారంలో ఒక్కసారి వేడినీటి స్నానం చేసే వ్యక్తుల్లో సగం మంది కొంత కాలానికి పైకిపోగా,  వారంలో రెండు, మూడు సార్లు వేడినీటి స్నానం చేసిన వ్యక్తుల్లో 38 శాతం మందే చనిపోయారు. వేడినీటి స్నానం తరుచూ చేయడం వల్ల రక్తప్రసరణ పెరిగి.. Blood pressure తగ్గుతుందని, తద్వారా Heart attack వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయని Steve అన్నారు. ఎక్కువ సేపు వేడినీటితో స్నానం చేయడం వల్ల 140 కెలరీలు ఖర్చయ్యాయని, ఇది 30 నిమిషాలు వడివడిగా నడవడంతో సమానమని తెలిపారు.

Tags: health tips, Hot water benefits, Best health tips, Telugu Health tips, Ayurvedic Tips, best telugu ayurvedic tips, 

కొవ్వు Fat ను తగ్గించే 12 ఆహార‌ ప‌దార్థాలు... వాటి నియమాలు?


 • వంట నూనెల్లో రారాజు olive oil,  Sunflower oil, Grandaunt oils తో  పోల్చుకుంటే దీని ఖర్చు ఎక్కువ. అయినా అన్ని నూనెల కంటే ఇందులోనే తక్కువ Cholesterol ఉంటుంది. olive oil లోని యాంటీ ఆక్సిడెంట్స్ హృద్రోగులకు ఎంతో మేలు చేస్తాయి.
 • బరువును తగ్గించేందుకు క్యాబేజీ Cabbage చక్కగా పనిచేస్తుంది. తరచూ క్యాబేజీని తినే వాళ్లలో Cholesterol మోతాదు కూడా తక్కువగా ఉంటుంది. ఎక్కువ నూనెతో క్యాబేజీ Cabbage కూరలు చేయకుండా, ఉడికించిన Cabbage కూరలు తింటేనే మేలు.
 • Calcium, potassium, iron పెసరపప్పులో పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు Vitamin ఎ, బి, సి, ఇ, ప్రొటీన్లు, ఫైబర్ దానిలో ఎక్కువగా ఉంటాయి. Fat తక్కువ. 
 • తేనె Honey మధురమైన రుచిని మాత్రమే కాదు, Obesity ని తగ్గించి, తక్కువ సమయంలోనే ఎక్కువ శక్తిని అందిస్తుంది. రోజూ ఉదయం పూట వేడి నీళ్లలో పది చుక్కల తేనె కలుపుకొని తాగితే చురుగ్గా ఉంటారు
 •  చెక్కా లవంగాలు Wood cloves లేకుండా మసాలా వంటలు  ఉండవు. భారతీయ సంప్రదాయ వంటకాల్లో చెక్కా లవంగాల వాడకం ఈనాటిది కాదు. వీటిలోని ఉత్తమ ఔషధ గుణాలు Diabetes, cholesterol సమస్యలు రాకుండా చేస్తాయి. ఎల్.డి.ఎల్., ట్రైకోగ్లిజరైడ్స్‌ Triglyceride's ను తగ్గిస్తాయి. 
 • రోజూ తినే తిండిలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు మంచిది. 'low lipoprotein density' అంటే చెడు Cholesterol ను తగ్గించి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది పసుపు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యను తొలగించి, Heart attack రాకుండా కాపాడుతుంది.
 •  యాలకులతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. ఇది వరకే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును సైతం తొలగించే శక్తి యాలకులలో ఉంది.
 • మిరపకాయలు  తిన్నాక కేవలం 20 నిమిషాల్లోనే ప్రభావం కనిపిస్తుంది. మిరపకాయలు లోని Capsaicin క్యాలరీలను వేగంగా ఖర్చుచేస్తుంది. క్యాలరీలు తొందరగా ఖర్చయ్యేకొద్దీ Cholesterol పెరగదు.
 •  గ్లాసుడు మజ్జిగలో 2.2 గ్రాముల Fat, 99 Calories దొరుకుతాయి. అదే పాలలో అయితే 8.9 గ్రాముల fat 157 Calories ఉంటాయి. శరీరంలో తక్కువ కొవ్వును చేర్చి, ఎక్కువ శక్తిని ఇచ్చే గుణం మజ్జిగలో ఉన్నాయి. వెన్న తీసిన మజ్జిగతో బరువు కూడా తగ్గవచ్చు.
 • అత్యధిక ఫైబర్ దొరికే ధాన్యాల్లో సజ్జలు ముందు వరుసలో ఉంటాయి. రాగి, జొన్న, గోధుమలను ఎక్కువగా వాడితే తక్కువ Cholesterol తో పాటు ఎక్కువ Fiber లభిస్తుంది. సజ్జలతో చేసిన రొట్టెలు తింటే మంచి ప్రయోజనం ఉంటుంది .
 •  బరువు తగ్గించేందుకు కరివేపాకులు చాల ఉపయోగపడతాయి. శరీరంలో పేరుకుపోయిన Toxins, చెడుకొవ్వును తొలగిస్తాయి . కూరల్లో కలిపి తిన్నా సరే, లేకపోతే రోజూ పది కరివేపాకులతో జ్యూస్ చేసుకొని తాగినా మంచి ప్రయోజనం ఉంటుంది.
 • వెల్లుల్లిలోని Anti-bacterial acids కొవ్వును బాగా తగ్గిస్తాయి. అందుకే వెల్లుల్లిని 'Fat Burning Food' అని పిలుస్తారు. చెడు Cholesterol ను తగ్గించి, అధిక రక్తపోటు సమస్యను నివారించడంలో వెల్లుల్లి పాత్ర ఎనలేనిది.
Tags: Fat Loss health tips, Fat loss best food, Fat loss best tips, Telugu tips for fat loss, Fat loss ayurvedic tips, best telugu ayurvedic tips, Telugu health tips

Wednesday, 20 July 2016

దానిమ్మ పండు Pomegranate తో ఆయిస్సు పెంపు

Granatum

మీరు రోజూ పండ్లు తింటారా..? అందులో దానిమ్మ పండ్లు ఎక్కువగా ఉంటాయా..? అయితే మీ ఆయుష్షుకు ఢోకా లేదు. ఎందుకంటే దానిమ్మ పండ్లు ఎక్కువగా తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందని స్విట్జర్లాండ్‌లోని ఈపీఎఫ్‌ఎల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దానిమ్మ గింజల్లో ఉండే ఓ పరమాణువు కడుపులో ఉండే బ్యాక్టీరియా వల్ల వయోభారంతో వచ్చే సమస్యలను సరిచేసేదిగా మారుతుందని పేర్కొంటున్నారు. ఎలుకలతోపాటు నెమటోడ్ సి.ఎలిగాన్స్ జీవులపై జరిగిన పరిశోధనల్లో ఇప్పటికే రుజువు కాగా, మానవులపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి.

వయసు మీద పడుతున్న కొద్దీ మన శరీర కణాల్లో శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియా బలహీనపడుతుంటాయి. చేయాల్సిన పనులు కూడా చేయలేక పోగుపడుతుంటాయి. దీని ప్రభావం కండరాలు, కణజాలంపై పడి అవి బలహీనమవుతుంటాయి. పార్కిన్‌సన్స్ వ్యాధికి కూడా ఇలా పోగుబడిన మైటోకాండ్రియాలు ఒక కారణం కావచ్చని ఇప్పటికే కొన్ని అంచనాలు ఉన్నాయి. అయితే ఉరోలిథిన్-2 అనే ఓ రసాయనం.. ఈ బలహీనపడ్డ మైటోకాండ్రియాను పూర్తి స్థాయిలో మరమ్మతు చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే దానిమ్మ గింజల్లో ఉరోలిథిన్-ఏ తయారీకి అవసరమైన పరమాణువులు ఉంటాయని, పేగుల్లోని బ్యాక్టీరియా సాయంతో దీన్ని తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. 8 నుంచి 10 రోజులు మాత్రమే జీవించే నెమటోడ్‌లపై దీన్ని ప్రయోగించినప్పుడు వాటి ఆయువు దాదాపు 45 శాతం వరకు ఎక్కువైంది. 

ఎలుకల్లో కూడా 42 శాతం వృద్ధి కనిపించడంతో పాటు అవి మరింత చురుగ్గా కదులుతున్నట్లు గుర్తించారు. తగిన బ్యాక్టీరియా లేకపోతే కొంతమంది ఎన్ని దానిమ్మ పండ్లు తిన్నా ఫలితం ఉండకపోవచ్చునని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు అమేజెనిటిస్ అనే కంపెనీ ముందుకొచ్చింది. ఉరోలిథిన్-ఏను నేరుగా అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఇది యూరప్‌లోని కొన్ని ఆసుపత్రుల్లో ప్రయోగాలు చేపడుతోంది. ఈ పరిశోధన తాలూకూ వివరాలు నేచర్ మెడిసిన్ మేగజీన్‌లో ప్రచురితమయ్యాయి.

Tags:health tips, best health tips, Telugu health tips, Pomegranate health benefits, Pomegranate benefits, 

Google+ Followers